Counselling: ఈ నెల 23 నుంచి ఏపీ ఎంసెట్ కౌన్సెలింగ్

AP EAMCET Counselling notification
  • ఇటీవలే విడుదలైన ఎంసెట్ ఫలితాలు
  • అక్టోబరు 26 వరకు కౌన్సెలింగ్
  • నోటిఫికేషన్ విడుదల
ఇటీవలే ఏపీ ఎంసెట్ ఫలితాలు విడుదలైన నేపథ్యంలో ఈ నెల 23 నుంచి ఎంసెట్ కౌన్సెలింగ్ నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సాంకేతిక విద్య విభాగం ప్రత్యేక కమిషనర్ ఎంఎం నాయక్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఎంసెట్ లో అర్హత సాధించిన విద్యార్థులు ఈ కౌన్సెలింగ్ లో పాల్గొనవచ్చు. ఈ వెబ్ కౌన్సెలింగ్ లో పాల్గొనేందుకు ఓసీ, బీసీ విద్యార్థులు రూ.1,200, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు రూ.600 చొప్పున ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. వెబ్ ఆప్షన్ల నమోదు, సీట్ల కేటాయింపు తేదీలను తర్వాత ప్రకటించనున్నారు.

కౌన్సెలింగ్ తేదీలు ఇవే...

  • అక్టోబరు 23-  ఆంగ్లో ఇండియన్, పీహెచ్ వీ, పీహెచ్ హెచ్, పీహెచ్ఓ కేటగిరీల్లో 1 నుంచి చివరి ర్యాంకు వరకు కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. అదే రోజున ఎన్ సీసీ కేటగిరీలో నుంచి 35,000 ర్యాంకు వరకు కౌన్సెలింగ్ ఉంటుంది.

  • అక్టోబరు-24- సీఏపీ కేటగిరీలో 1 నుంచి  45,000 వరకు, ఎన్ సీసీ కేటగిరీలో 35,001 నుంచి 70,000 వరకు, స్పోర్ట్స్ అండ్ గేమ్స్ కేటగిరీలో 1 నుంచి 45,000 ర్యాంకు వరకు కౌన్సెలింగ్ నిర్వహిస్తారు.

  • అక్టోబరు 25- సీఏపీ కేటగిరీలో 45,001 నుంచి 90,000 ర్యాంకు వరకు, ఎన్ సీసీ కేటగిరీలో 70,001 నుంచి 1,05,000 వరకు, స్పోర్ట్స్ అండ్ గేమ్స్ కేటగిరీలో 45,001 నుంచి 90,000 వరకు కౌన్సెలింగ్ చేపడతారు.

  • అక్టోబరు 26- సీఏపీ కేటగిరీలో 90,001 నుంచి చివరి ర్యాంకు వరకు, ఎన్ సీసీ కేటగిరీలో 1,05,001 నుంచి చివరి ర్యాంకు వరకు, స్పోర్ట్స్ అండ్ గేమ్స్ కేటగిరీలో 90,001 నుంచి చివరి ర్యాంకు వరకు కౌన్సెలింగ్ జరుపుతారు. 
Counselling
EAMCET
Andhra Pradesh
Notification

More Telugu News