Virat Kohli: ఇలాంటి ఫన్నీ విన్యాసాలు కోహ్లీకే సాధ్యం... వైరల్ అవుతున్న వీడియో

Kohli funny warm up went viral on social media
  • ఈసారి ఐపీఎల్ లో రాణిస్తున్న బెంగళూరు టీమ్
  • జోరుమీదున్న కోహ్లీ
  • కామెడీ చేష్టలతో నవ్విస్తున్న కెప్టెన్
గత సీజన్లకు భిన్నంగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ఈసారి ఐపీఎల్ లో దూసుకుపోతోంది. కెప్టెన్ విరాట్ కోహ్లీ స్ఫూర్తిదాయకమైన బ్యాటింగ్ తో ముందుండి నడిపిస్తున్నాడు. ఈ సీజన్ లో ఆర్సీబీ ఇప్పటివరకు 8 మ్యాచ్ లు ఆడి 5 విజయాలు సాధించింది. మునుపటి సీజన్లతో పోల్చితే ఈసారి మెరుగైన ఆటతీరు కనబరుస్తున్నట్టే భావించాలి.

ఇక అసలు విషయానికొస్తే.... విరాట్ కోహ్లీ మైదానంలో ఎంతో ఫన్నీగా ఉంటాడని తెలిసిందే. ఇక వార్మప్ సమయంలో అయితే ఇతర ఆటగాళ్లు కోహ్లీ చేష్టలకు కడుపుబ్బా నవ్వుకుంటారు. ఇతరులను అనుకరించడంలోనూ, చిత్రవిచిత్రమైన విన్యాసాలు చేయడంలోనూ తనకు తానే సాటి. తాజాగా, కోహ్లీకి సంబంధించిన ఓ ఫన్నీ వీడియో ఇంటర్నెట్లో వైరల్ అవుతోంది. మైదానంలో కసరత్తులు చేస్తూ, వాటికి డ్యాన్స్ స్టెప్పులు మిక్స్ చేస్తూ కోహ్లీ అందించిన వినోదం అంతాఇంతా కాదు. కోహ్లీ కామెడీకి సోషల్ మీడియాలో విశేష స్పందన వస్తోంది.

Virat Kohli
Fun
Warm Up
RCB
India

More Telugu News