saitej: ‘సోలో బ్రతుకే సో బెటర్’ సినిమా నుంచి బ్రేకప్ సాంగ్ విడుదల చేసిన చిరు

Megastar  chiranjeevi unveils Breakup anthem Broken heart of the year
  • సాయి తేజ్ హీరోగా ‘సోలో బ్రతుకే సో బెటర్’
  • ఆయన పుట్టినరోజు సందర్భంగా  ‘అమృత’ సాంగ్ విడుదల
  • ఒగ్గేసి పోకే ‘అమృత’ అంటూ సాగుతున్న పాట
యంగ్ హీరో సాయి తేజ్ నటిస్తోన్న ‘సోలో బ్రతుకే సో బెటర్’ సినిమా నుంచి మరో సాంగ్ విడుదలైంది. సాయితేజ్ పుట్టినరోజు సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి తన ట్విట్టర్ ఖాతా ద్వారా ‘అమృత’  పాటను విడుదల చేశారు. సాయి తేజ్ కు ఆయన పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఇప్పటికే సోలో బ్రతుకే సో బెటర్ సినిమా నుంచి రెండు పాటలు విడుదలయ్యాయి. గతంలో ఈ సినిమా నుంచి ‘నో పెళ్లి’ సాంగ్‌ని విడుదల చేసిన సంగతి తెలిసిందే.

అనంతరం ‘హాయ్ ఇది నేనేనా’ అనే పాట విడుదలైంది. తాజాగా, లవ్ బ్రేకప్ సాంగ్ విడుదలైంది.  ’బల్బు కనిపెట్టినోడికే బతుకు చిమ్మ చీకటైపోయిందే, సెల్ ఫోన్ కంపెనోడికే సిమ్ కార్డు బ్లాకై పోయిందే’ అంటూ ఈ పాట ప్రారంభమవుతుంది. ఒగ్గేసి పోకే ‘అమృత’ అంటూ సాయి తేజ్ తన బాధను ఈ పాట రూపంలో చెబుతున్నాడు.
saitej
Chiranjeevi
Tollywood
Viral Videos

More Telugu News