KTR: హిమాయత్ సాగర్, హుసేన్ సాగర్ నీరు విడుదల.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: కేటీఆర్

ktr meeting with collectors
  • జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో సమావేశం
  • రోడ్లపై నిలిచిన నీటిని తొలగించేందుకు చర్యలు చేపట్టాలి
  • మ్యాన్‌ హోళ్లు ఉన్న ప్రాంతాల్లో సురక్షిత చర్యలు చేపట్టాలి
  • ప్రభావిత ప్రజలను ఫంక్షన్‌హాళ్లు, కమ్యూనిటీ హాళ్లకు తరలించాలి
తెలంగాణను భారీ వర్షాలు ముంచెత్తుతోన్న నేపథ్యంలో చేపట్టవలసిన సహాయక చర్యలపై తెలంగాణ మంత్రి కేటీఆర్‌ ఈ రోజు జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించి కీలక సూచనలు చేశారు. ఇందులో రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌, పురపాలకశాఖ అధికారులు పాల్గొన్నారు.

అలాగే, టెలీ కాన్ఫరెన్స్ ద్వారా హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల కలెక్టర్లతో కేటీఆర్ మాట్లాడారు. హిమాయత్‌సాగర్, హుస్సేన్‌సాగర్‌ నీటి విడుదల కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన చెప్పారు. వర్షాల కారణంగా రోడ్లపై నిలిచిన నీటిని తొలగించేందుకు చర్యలు చేపట్టాలని ఆయన ఆదేశించారు.

మ్యాన్‌ హోళ్లు ఉన్న ప్రాంతాల్లో సురక్షిత చర్యలు చేపట్టాలని,  నాలాల వద్ద ఉన్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. జీహెచ్ఎంసీ మేయర్‌, స్థానిక ఎమ్మెల్యేలు, అధికారులు,  క్షేత్రస్థాయిలో పరిస్థితిని సమీక్షించాలని చెప్పారు. వరద ప్రభావం అధికంగా ఉన్న ప్రాంతాల్లోని ప్రజలను ఫంక్షన్‌హాళ్లు, కమ్యూనిటీ హాళ్లకు తరలించాలని తెలిపారు. వారికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేయాలని సూచించారు.
KTR
Telangana
rain

More Telugu News