Amrita Rao: తల్లి కాబోతున్న బాలీవుడ్ నటి అమృతారావు!

- 2016లో అన్మోల్ ను పెళ్లాడిన అమృత
- బేబీ బంప్ తో కెమెరా కంటికి చిక్కిన వైనం
- సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫొటో
బాలీవుడ్ నటి అమృతారావు తల్లి కాబోతోంది. హిందీలో పలు చిత్రాల్లో నటించిన ఆమె... టాలీవుడ్ లో మహేశ్ బాబు సరసన 'అతిథి' సినిమాలో తళుక్కుమంది. ఆ తర్వాత 2016లో అన్మోల్ అనే రేడియో జాకీని ఆమె పెళ్లి చేసుకుంది.
అమృత తల్లి అవుతున్నట్టు దంపతులిద్దరూ ఇంకా ప్రకటించలేదు. అయితే మెడికల్ చెకప్ కోసం వారు బయటకు వచ్చినప్పుడు... బేబీ బంప్ తో ఉన్న అమృత కెమెరా కంటికి చిక్కింది. ఆసుపత్రి వద్ద వీరిద్దరూ నిల్చున్న ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఈ సందర్భంగా అమృత ఫ్యామిలీ ఫ్రెండ్ ఒకరు స్పందిస్తూ, ఆర్భాటాలకు ఆమె ఎక్కువగా ప్రాధాన్యతను ఇవ్వరని.. అందుకే తల్లి కాబోతున్న విషయం గురించి ఆమె సన్నిహితులకు తప్ప మరెవరికీ చెప్పలేదని తెలిపారు. మరోవైపు తన పెళ్లి విషయాన్ని కూడా అమృత సన్నిహితులకు తప్ప మరెవరికీ చెప్పకపోవడం గమనార్హం.
