Shruti Haasan: నేను ఎంత ఒంటరిదాన్నో నాకు తెలిసింది: శ్రుతి హాసన్

I learnt many things in this year says Shruti Haasan
  • కరోనా వల్ల ఈ ఏడాది ఎంతో నేర్చుకున్నా
  • మనుషులు, మానవత్వం గురించి తెలుసుకున్నా
  • నా బలాలు, బలహీనతల గురించి నేర్చుకున్నా

కరోనా మహమ్మారి కారణంగా ప్రతి ఒక్కరి జీవితం ప్రభావితమైంది. కొందరికి కరోనా తీవ్ర ఆవేదనను మిగిల్చింది. మరికొందరికి తమ అసలైన జీవితం ఏమిటో తెలుసుకునేందుకు ఒక రకంగా సాయం చేసింది. అనుక్షణం బిజీగా గడిపే సినీ సెలబ్రిటీలు సైతం నెలల తరబడి ఇళ్లకే పరిమితమయ్యారు. దిగ్గజ నటుడు కమలహాసన్ కుమార్తె, హీరోయిన్ శ్రుతి హాసన్ కూడా కరోనా సమయంలో తాను ఎన్నో నేర్చున్నానని తెలిపింది.

మనుషుల గురించి, మానవత్వం గురించి, మన బలాలు, బలహీనతల గురించి ఈ సంవత్సరం ఎంతో నేర్చుకున్నానని శ్రుతి తెలిపింది. తాను ఎంత ఒంటరి వ్యక్తినో, తనకు మనుషులు ఇచ్చే విలువ ఏంటో తెలుసుకున్నానని చెప్పింది. ముఖ్యంగా తనను తాను ఎలా ప్రేమించుకోవాలనే  విషయాన్ని నేర్చుకున్నానని తెలిపింది. తాను ఎక్కడ ఉన్నానో తెలుసుకునేందుకు ఈ సమయం ఎంతో ఉపయోగపడిందని చెప్పింది. సినీ ప్రపంచం, కళ, అవి తనకిచ్చే ప్రేమ గురించి తెలుసుకున్నానని తెలిపింది.

  • Loading...

More Telugu News