RGV: టీచర్ టీచర్ అంటూ పిల్లాడు ఫిర్యాదు చేసినట్లు ఉంది: బాలీవుడ్ ప్రముఖుల తీరుపై వర్మ ఎద్దేవా

Ram Gopal Varma RGVzoomin Reaction of Bollywood Is too late and too thanda
  • చాలా ఆలస్యంగా, చాలా కూల్ గా బాలీవుడ్ ప్రతిస్పందించింది
  • ఢిల్లీ హైకోర్టులో సినీ రంగ ప్రముఖులు ఫిర్యాదు చేశారు
  • బడి పిల్లాడు తమ టీచర్ వద్దకు వెళ్లి ఫిర్యాదు చేసినట్లు ఉంది
  • టీచర్ టీచర్ అర్ణబ్ మమ్మల్ని తిడుతున్నాడు అని చెప్పినట్లుంది 
బాలీవుడ్‌ సినీ పరిశ్రమపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తూ, ఈ సినీ పరిశ్రమ డ్రగ్స్‌ బానిసలతో నిండిపోయిందని రిపబ్లిక్‌ టీవీ, టైమ్స్‌ నౌ చానెళ్లు కథనాలు ప్రసారం చేశాయని బాలీవుడ్ ప్రముఖులు ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఆ చానెళ్లపై చర్యలు తీసుకోవాలని కోరుతూ  కరణ్‌ జొహార్‌, యశ్‌ రాజ్‌, అనిల్‌ కపూర్‌, అజయ్‌ దేవ్‌గణ్‌, అమీర్‌ ఖాన్‌, షారుఖ్‌ ఖాన్‌, సల్మాన్‌ ఖాన్ కు చెందిన సంస్థలు సహా 38 నిర్మాణ సంస్థలు వ్యాజ్యం దాఖలు చేశాయి.

రిపబ్లిక్‌ టీవీకి చెందిన అర్ణబ్‌ గోస్వామి, ప్రదీప్‌ భండారితో పాటు టైమ్స్‌ నౌకు చెందిన రాహుల్‌ శివ్‌ శంకర్‌, నవికా కుమార్‌లు బాలీవుడ్‌పై ఇష్టం వచ్చినట్లు వ్యాఖ్యలు చేశారని వారు పేర్కొన్నారు. దీనిపై వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్పందిస్తూ వారి తీరును ఎద్దేవా చేశారు.

‘చాలా ఆలస్యంగా, చాలా కూల్ గా బాలీవుడ్ ప్రతిస్పందించింది. ఢిల్లీ హైకోర్టులో సినీ రంగ ప్రముఖులు ఫిర్యాదు చేయడం.. బడి పిల్లాడు తమ టీచర్ వద్దకు వెళ్లి 'టీచర్ టీచర్ ఆ అర్ణబ్ మమ్మల్ని తిడుతున్నాడు టీచర్' అని చెప్పినట్లు ఉంది’ అని రామ్ గోపాల్ వర్మ ఎద్దేవా చేశారు.
RGV
Bollywood
Shahrukh Khan
Salman Khan
Aamir Khan

More Telugu News