: హెడ్లీ, రాణాలను అప్పగించాలని కోరిన భారత్

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన 26/11 ముంబయి ఉగ్రదాడుల కేసులో నిందితులు డీన్ హెడ్లీ, తహావ్వుర్ రాణాలను అప్పగించాలని భారత్.. అమెరికాను కోరింది. హెడ్లీ, రాణా ఇద్దరూ ప్రస్తుతం అమెరికా జైల్లో ఉన్నారు. వారిద్దిరిపై అక్కడ తీవ్రవాద నేరాల అభియోగాలు రుజువు కావడంతో శిక్ష తప్పలేదు. కాగా, భారత హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే ప్రస్తుతం అమెరికాలో పర్యటిస్తున్నారు. షిండే.. అమెరికా అటార్నీ జనరల్ ఎరిక్ హోల్డర్ తో భేటీ సందర్భంగా.. హెడ్లీ, రాణాలను భారత్ కు అప్పగించాలని కోరినట్టు సమాచారం. హెడ్లీ.. లష్కరే తోయిబా తరుపున ముంబయి దాడులకు ముందు రెక్కీ నిర్వహించిన సంగతి తెలిసిందే.

More Telugu News