MS Dhoni: ధోనీ కుమార్తెపై నీచమైన వ్యాఖ్యలు చేసిన యువకుడి అరెస్ట్!

Youth Arrested from Gujarath in Link to Threats to Dhoni daughter
  • ఇన్ స్టాగ్రామ్ లో ఇంటర్ బాలుడి వ్యాఖ్యలు
  • అరెస్ట్ చేసిన గుజరాత్ పోలీసులు
  • తదుపరి విచారణ నిమిత్తం రాంచీ పోలీసులకు అప్పగింత
చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కెప్టెన్ ఎంఎస్ ధోనీ కుమార్తె జీవాపై నీచమైన వ్యాఖ్యలు చేసిన 16 ఏళ్ల ఇంటర్ చదువుతున్న బాలుడిని గుజరాత్ లోని ముంద్రా ప్రాంతంలో పోలీసులు అరెస్ట్ చేశారు. అతను నమ్న కపాయా గ్రామానికి చెందినవాడని, ఇటీవల అతను సోషల్ మీడియాలో ధోనీ మైనర్ కుమార్తె గురించి అనుచిత వ్యాఖ్యలు చేశాడని, ప్రస్తుతం అతన్ని ప్రశ్నిస్తున్నామని పశ్చిమ కచ్ సూపరింటెండెంట్ సౌరభ్ సింగ్ మీడియాకు తెలిపారు.

కోల్ కతా నైట్ రైడర్స్ తో చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ తరువాత, తన ఇన్ స్టాగ్రామ్ లో ఈ పోస్ట్ ను స్వయంగా పెట్టినట్టు ఆ బాలుడు అంగీకరించాడని తెలిపిన సౌరబ్ సింగ్, అతనితో పాటు మరికొందరు కూడా జీవాపై ఇదే తరహా పోస్టులు పెట్టారని అన్నారు. అతన్ని రాంచీ పోలీసులకు అప్పగించనున్నామని, ఆ నగరంలోనే అతనిపై ఎఫ్ఐఆర్ నమోదు కానుందని తెలిపారు. తదుపరి విచారణ నిమిత్తం బాలుడిని తీసుకెళ్లేందుకు రాంచీ పోలీసులు కచ్ కు రానున్నారని స్పష్టం చేశారు.

జీవాపై వ్యాఖ్యలు వెల్లువెత్తడంతో, పలువురు క్రికెటర్లు, రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. ధోనీ వరుస వైఫల్యాలకు జీవానే కారణమని, కుమార్తె కారణంగానే ధోనీ తన జట్టును గెలిపించలేకపోతున్నాడని... పేర్కొంటూ ఆమెపై సోషల్ మీడియాలో పెట్టిన నీచమైన పోస్టులు వైరల్ అయిన సంగతి తెలిసిందే. చిన్న పాపని కూడా చూడకుండా ఈ తరహా వ్యాఖ్యలు చేసిన అందరిపైనా చర్యలు తీసుకోవాలని పోలీసులపై ఒత్తిడి పెరుగుతోంది.
MS Dhoni
Jeva
Instagram
Arrest
Ranchi

More Telugu News