Aamir Khan: నాలుగేళ్లుగా డ్రిపెషన్‌లో ఉన్నాను: స్టార్ హీరో ఆమిర్ ఖాన్ కూతురు

aamir khan duaghter in depression
  • ప్రపంచ మానసిక దినోత్సవం సందర్భంగా పోస్ట్
  • డిప్రెషన్ కు వైద్యుడి వద్ద చికిత్స తీసుకున్నా
  • నా పరిస్థితి ప్రస్తుతం బాగానే ఉంది
  • మానసిక ఆరోగ్యం గురించి ఏదైనా చేయాలని అనుకుంటున్నా 
తాను నాలుగేళ్లుగా డ్రిపెషన్‌లో ఉన్నానని బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్ కూతురు ఐరా ఖాన్‌ తెలిపింది.  ప్రపంచ మానసిక దినోత్సవం సందర్భంగా  ఆమె తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో ఈ విషయాన్ని తెలుపుతూ వీడియో పోస్ట్ చేసింది. తాను డిప్రెషన్ కు వైద్యుడి వద్ద చికిత్స తీసుకున్నానని వివరించింది.

తన పరిస్థితి ప్రస్తుతం బాగానే ఉందని,  ఏడాది కాలంగా తాను మానసిక ఆరోగ్యం గురించి ఏదైనా చేయాలని అనుకుంటున్నానని చెప్పింది. తనకు ఏం చేయాలో అర్థం కాలేదని, దీంతో తన ప్రయాణంలో అందరినీ భాగం చేయాలనుకున్నానని వ్యాఖ్యానించింది. తన డిప్రెషన్ గురించి ఈ విషయాలు తెలుసుకుంటే ఇతరులు కూడా మానసిక ఆరోగ్యంపై అవగాహన పొందుతారని చెప్పింది. అందుకే తాను తన డిప్రెషన్ గురించి ఈ వీడియో చేశానని తెలిపింది.  

 

Aamir Khan
Bollywood
Viral Videos

More Telugu News