MS Dhoni: ధోనీ కూతురుపై నీచమైన వ్యాఖ్యలు.. తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన ప్రజ్ఞాన్ ఓఝా

Ex cricketer Ojha anger over comments on Dhonis daughter
  • దిగజారుడు వ్యాఖ్యలు చేసిన కొందరు నెటిజెన్లు
  • కుటుంబసభ్యులపై ఈ వ్యాఖ్యలు ఏమిటన్న ఓఝా
  • ఇలా చేస్తే ఎవరూ ఊరుకోరని హెచ్చరిక
ఐపీఎల్ లో చెన్నై ఓటమిని భరించలేని కొందరు నెటిజెన్లు ఆటగాళ్లపై వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారు. టీమిండియా మాజీ కెప్టెన్ ధోనీ చిన్నారి కూతురుపై కూడా కొందరు సోషల్ మీడియా ద్వారా అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై మాజీ క్రికెటర్ ప్రజ్ఞాన్ ఓఝా తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు.

మ్యాచ్ ఓడిపోతే ఆటగాళ్లను విమర్శించడం వరకు ఓకే కానీ... వాళ్ల కుటుంబసభ్యులపై అసభ్యకర వ్యాఖ్యలు చేయడం ఏమిటని ఓఝా మండిపడ్డాడు. దిగ్గజ కెప్టెన్లలో ఒకడిగా నిలిచిన ధోనీకి మీరిచ్చే గౌరవం ఇదేనా? అని ప్రశ్నించాడు. ఇలాంటి వ్యాఖ్యలను అవతలి వ్యక్తి చదివినప్పుడు చాలా డిస్టర్బ్ అవుతాడని అన్నాడు. ఆటగాళ్లు కూడా మనుషులేనని, వాళ్లకు కూడా మనసులు ఉంటాయని చెప్పాడు. హద్దు దాటి ప్రవర్తిస్తే ఎలా ఉంటుందో మీ వరకు వస్తే కానీ అర్థం కాదని అన్నాడు. ఆటగాళ్ల కుటుంబాల వరకు వెళ్తే ఎవరూ ఊరుకోరని చెప్పాడు.
MS Dhoni
Daughter
IPL
CSK

More Telugu News