Corona Virus: ఏపీ కరోనా అప్ డేట్: 5,653 మందికి పాజిటివ్, 35 మరణాలు

Thirty five more deaths happens in AP due to corona
  • గత 24 గంటల్లో 6,659 మందికి కరోనా నయం
  • పశ్చిమ గోదావరి జిల్లాలో కొత్తగా 823 కేసులు
  • అత్యల్పంగా కర్నూలు జిల్లాలో 119
మునుపటితో పోల్చితే ఏపీలో కరోనా వైరస్ ప్రభావం గణనీయంగా తగ్గుముఖం పడుతున్నట్టు అర్థమవుతోంది. గడచిన 24 గంటల్లో 5,653 పాజిటివ్ కేసులు వెల్లడి కాగా, అదే సమయంలో 35 మంది మరణించారు. 6,659 మంది కరోనా నుంచి కోలుకున్నారు. అత్యధికంగా పశ్చిమ గోదావరి జిల్లాలో 823 పాజిటివ్ కేసులను గుర్తించారు. అత్యల్పంగా కర్నూలు జిల్లాలో 119 మందికి కరోనా సోకినట్టు తేలింది.

ఓవరాల్ గణాంకాలు చూస్తే... ఏపీలో ఇప్పటివరకు 7,50,517 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 6,97,699 మందికి కరోనా నయం అయింది. ఇంకా 46,624 మందికి చికిత్స కొనసాగుతోంది. రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 6,194కి పెరిగింది.
Corona Virus
Andhra Pradesh
Deaths
Positive Cases

More Telugu News