Nara Lokesh: గుండెలు ఆగిపోతున్నా.. జగన్ మనసు మాత్రం కరగడం లేదు: నారా లోకేశ్

So far 92 farmers died due to YSRCP says Nara Lokesh
  • 92 మంది రైతులు ఇప్పటి వరకు బలయ్యారు
  • ఒకే రోజు ఇద్దరు చనిపోవడం బాధాకరం
  • మూడు రాజధానుల మూర్ఖపు ఆలోచన మానుకోండి
వైసీపీ నేతల అవమానాలతో అమరావతిలో 92 మంది రైతులు బలయ్యారని టీడీపీ నేత నారా లోకేశ్ ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రం కోసం తమ భూములను త్యాగం చేసిన రైతుల గుండెలు ఆగిపోతున్నప్పటికీ... జగన్ గారి మనస్సు కరగడం లేదని అన్నారు.

అమరావతి ఉద్యమం 300వ రోజుకు చేరుకుంటున్న సమయంలో ఒకే రోజున ఇద్దరు రైతులు చనిపోవడం చాలా బాధాకరమని చెప్పారు. కృష్ణాయపాలెం గ్రామానికి చెందిన లంకా శివరామకృష్ణ, ఉద్దండరాయునిపాలెం గ్రామానికి చెందిన పులి చిన్న లాజర్ మృతి పట్ల సంతాపం తెలుపుతున్నానని అన్నారు. మూడు రాజధానుల మూర్ఖపు ఆలోచన మానుకొని... ఉన్న అమరావతిని అభివృద్ధి చెయ్యాలని ప్రభుత్వానికి సూచించారు.
Nara Lokesh
Telugudesam
Jagan
YSRCP
Amaravati

More Telugu News