'దిశ ఎన్ కౌంటర్' చిత్రంపై కోర్టు ఎలా చెబితే అలా చేస్తాం: నిర్మాత నట్టికుమార్

Producer Natti Kumar says they will follow court orders
  • 'దిశ ఎన్ కౌంటర్' పేరిట వర్మ చిత్రం
  • హైకోర్టును ఆశ్రయించిన దిశ తండ్రి
  • కేంద్రం, సెన్సార్ బోర్డులకు హైకోర్టు ఆదేశాలు
  • దిశ తల్లిదండ్రుల అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుంటామన్న నట్టి
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 'దిశ ఎన్ కౌంటర్' పేరిట సినిమా తీస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాపై దిశ తండ్రి హైకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో ఈ చిత్ర నిర్మాత నట్టికుమార్ స్పందిస్తూ, 'దిశ ఎన్ కౌంటర్' చిత్రంపై కోర్టు నిర్ణయాన్ని అనుసరిస్తామని, కోర్టు ఏంచెబితే అది పాటిస్తామని స్పష్టం చేశారు. ఏవైనా సీన్లు తొలగించాలని కోర్టు చెప్పినా, అందుకు తాము సమ్మతమేనని వివరించారు.

దిశ తల్లిదండ్రులను బాధించేలా ఈ చిత్రం తీయలేదని, సమాజంలోని ఓ ఘటనను ఈ సినిమా ద్వారా చూపించబోతున్నామని తెలిపారు. దిశ తల్లిదండ్రుల అభ్యంతరాలను కచ్చితంగా పరిగణనలోకి తీసుకుంటామని నట్టి కుమార్ స్పష్టం చేశారు. కాగా, దిశ తండ్రి ఈ సినిమాపై హైకోర్టును ఆశ్రయించగా, ఆయన వినతిపత్రంలోని అంశాలపై వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకోవాలంటూ హైకోర్టు కేంద్ర ప్రభుత్వం, సెన్సార్ బోర్డులకు ఆదేశాలు జారీచేసింది.
Go Back to Shorts
Natti Kumar
Disha Encounter
RGV
Disha
High Court

More Telugu News