tiger: హైద‌రాబాద్‌లో అలజడి రేపుతోన్న చిరుత .. లేగ దూడలను చంపి తిన్న వైనం

Leopard  in hyd
  • హైద‌రాబాద్‌లో రెండు నెలల క్రితం కూడా ఓ చిరుత అలజడి 
  • తాజాగా రాజేంద్ర‌న‌గ‌ర్ స‌మీపంలో చిరుత
  • ప్రజలు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌న్న పోలీసులు
హైద‌రాబాద్‌లో రెండు నెలల క్రితం ఓ చిరుత అలజడి రేపిన విషయం తెలిసిందే. కనపడిన వారిపై దాడి చేస్తూ తప్పించుకు తిరుగుతూ ఆ చిరుత కలకలం రేపిన ఘటనను మర్చిపోకముందే హైదరాబాద్ లో మరో చిరుత తిరుగుతోన్న ఘటన వెలుగులోకి వచ్చింది. రాజేంద్ర‌న‌గ‌ర్ వాలంత‌రి రైస్ రిసెర్చ్ సెంట‌ర్ స‌మీపంలో చిరుత సంచ‌రిస్తున్న‌ విషయాన్ని కొందరు గుర్తించారు.

గత అర్ధ‌రాత్రి అది రెండు లేగ దూడ‌ల‌ను చంపడంతో స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు. ఈ విషయంపై ఇప్పటికే స్థానికులు పోలీసులు, అట‌వీశాఖ సిబ్బందికి స‌మాచారం అందించారు. దీనిపై ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకున్న సిబ్బంది చిరుత కోసం గాలిస్తున్నారు. రాజేంద్ర నగర్ పరిసర ప్రాంతాల ప్రజలు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని పోలీసులు సూచించారు. కాగా, ఆగ‌స్టులో హిమాయ‌త్‌సాగ‌ర్ వాలంత‌రీ రిసెర్చ్ ఫ్యూమ్ హౌస్ వ‌ద్ద ఆవుల‌పై ఓ చిరుత దాడి చేసి చంపిన విషయం తెలిసిందే.
tiger
Hyderabad

More Telugu News