భారత సరిహద్దుల్లో చైనా వేలాది మంది సైనికుల్ని మోహరించింది: అమెరికా
- చైనా తీరును ఖండించిన పాంపియో
- చైనా తన చెడు ప్రవర్తనను బయటపెట్టిందని వ్యాఖ్య
- క్వాడ్ దేశాలకు చైనాతో ప్రమాదం ఉందని హెచ్చరిక
అనంతరం పాంపియో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. భారత సరిహద్దుల్లో చైనా దాదాపు 60 వేల మంది సైనికుల్ని మోహరించినట్లు చెబుతూ, చైనా తీరును ఆయన ఖండించారు. చైనా తన చెడు ప్రవర్తనను బయటపెట్టిందని, క్వాడ్ దేశాలకు చైనాతో ప్రమాదం ఉందని అన్నారు. ఇండో పసిఫిక్ సముద్ర ప్రాంతంలో దూకుడుగా వ్యవహరిస్తోందని తెలిపారు. భారత్‌లోని వాస్తవాధీన రేఖ వెంట డ్రాగన్ తీరు బాగోలేదని చెప్పారు.