Nara Lokesh: ఎమ్మెల్యే బంధువు రోడ్డు మీద తప్పతాగి లారీ ముందుపడుకుని హల్ చల్.. వీడియో పోస్ట్ చేసిన లోకేశ్

lokesh slams ap govt
  • వైకాపా ఇసుకాసురులు బరితెగించారు
  • ఇసుక దొరక్క, పనులు లేక కార్మికుల ఇబ్బందులు
  • అక్రమ రవాణా చేస్తూ కోట్లు మింగుతున్న వైకాపా నేతలు
  • అడ్డొచ్చిన ఎస్సై శరత్ చంద్రగారిపై తిరగబడి వార్నింగ్  
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై టీడీపీ నేత నారా లోకేశ్ తీవ్ర విమర్శలు గుప్పించారు. ‘వైకాపా ఇసుకాసురులు బరితెగించారు. ఇసుక దొరక్క, పనులు లేక పస్తులుండి భవన నిర్మాణ కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇసుక అక్రమ రవాణా చేస్తూ కోట్లు మింగుతున్న వైకాపా నేతలు రోడ్ల మీద వీరంగం వేస్తున్నారు’ అని ఆయన ఆరోపిస్తూ ట్వీట్లు చేశారు.

‘అనంతపురం జిల్లా పుట్టపర్తి నియోజకవర్గంలో ఎమ్మెల్యే బంధువు దుద్దకుంట సురేందర్ రెడ్డి రోడ్డు మీద తప్పతాగి హల్ చల్ చేశాడు. అడ్డొచ్చిన ఎస్సై శరత్ చంద్రగారిపై తిరగబడి వార్నింగ్ ఇచ్చాడు’ అని నారా లోకేశ్ తెలిపారు.

‘ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ పోస్ట్ పెడితే అరెస్ట్ చెయ్యమని ఒత్తిడి చేస్తున్న కొంతమంది అధికారులకు వైకాపా నేతలు చేస్తున్న అరాచకాలు కనిపించడం లేదా? వైకాపా నేతల నుండి పోలీసులకే రక్షణ లేనప్పుడు ఇక ప్రజల పరిస్థితి ఏంటి?’ అంటూ నారా లోకేశ్ విమర్శలు గుప్పించారు.
Nara Lokesh
Andhra Pradesh
YSRCP

More Telugu News