బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడి కారును ఢీకొట్టిన లారీ.. హత్యాయత్నమంటూ పోలీసులకు ఫిర్యాదు
- బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడిగా ఇటీవలే నియమితులైన అబ్దుల్లా కుట్టీ
- వెనక నుంచి రెండుసార్లు ఢీకొట్టిన లారీ
- కుట్ర దాగి ఉందన్న బీజేపీ కేరళ చీఫ్
అదే జిల్లాలో అదే రోజు మరో ఘటన కూడా జరిగిందని, వెలియంకోడ్లో రెస్టారెంట్లో ఉండగా కొందరు దుండగులు తన కారుపై రాళ్లు రువ్వారని, ఈ ఘటనపైనా పోలీసులకు ఫిర్యాదు చేశానని తెలిపారు. ఈ రెండు ఘటనలను బీజేపీ కేరళ చీఫ్ కె.సురేంద్రన్ తీవ్రంగా ఖండించారు. ఈ ఘటనల వెనక కుట్ర ఉందని ఆరోపించారు. దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనలపై రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడతామన్నారు. కాగా, అబ్దుల్లా కుట్టీ ఇటీవలే బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడిగా నియమితులయ్యారు.