Ram Gopal Varma: ఆర్జీవీ సినిమా ‘దిశ ఎన్‌కౌంటర్’ను ఆపాలంటూ కోర్టుకెక్కిన దిశ తండ్రి

Disha father approached high court to stop RGV Disha Encounter movie
  • దిశ ఘటన ఆధారంగా సినిమా రూపొందిస్తున్న రాంగోపాల్ వర్మ
  • విచారణలో ఉండగా సినిమా సరికాదన్న దిశ తరపు న్యాయవాది
  • యువతి తండ్రి ఇచ్చే వినతి పత్రంపై త్వరగా నిర్ణయం తీసుకోవాలంటూ సుప్రీం ఆదేశం
హైదరాబాద్‌లో సంచలనం సృష్టించిన దిశ సామూహిక అత్యాచారం, హత్య, ఆపై నిందితుల ఎన్‌కౌంటర్‌‌ను ఆధారంగా చేసుకుని ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ నిర్మిస్తున్న ‘దిశ ఎన్‌కౌంటర్’ సినిమాను ఆపాలంటూ బాధితురాలి తండ్రి హైకోర్టును ఆశ్రయించారు.

నిన్న ఇది విచారణకు రాగా.. ఆయన తరపు న్యాయవాది మాట్లాడుతూ.. దిశ ఘటనపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో ప్రత్యేక కమిటీ విచారణ చేస్తున్న ప్రస్తుత సమయంలో ఈ సినిమా నిర్మాణం సరికాదని అన్నారు. దీంతో కల్పించుకున్న కేంద్ర ప్రభుత్వ అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ రాజేశ్వర్‌రావు మాట్లాడుతూ.. సినిమా నిర్మాణంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ పిటిషనర్ నుంచి ఎటువంటి వినతిపత్రం అందలేదన్నారు. దీనికి స్పందించిన న్యాయమూర్తి, బాధిత యువతి తండ్రి ఇచ్చే వినతిపత్రంపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని కేంద్రం, సెన్సార్ బోర్డును ఆదేశించారు.
Ram Gopal Varma
Disha Encounter
TS High Court

More Telugu News