ఏపీ కరోనా అప్ డేట్: 31 మంది మృతి, 5,145 కొత్త కేసులు

  • గత 24 గంటల్లో 70,521 శాంపిల్స్ పరీక్ష
  • అత్యధికంగా పశ్చిమ గోదావరిలో 862 కేసులు
  • తాజాగా 6,110 మందికి కరోనా నయం
ఏపీలో గడచిన 24 గంటల్లో 70,521 కరోనా శాంపిల్స్ పరీక్షించగా, 5,145 మందికి పాజిటివ్ అని తేలింది. అత్యధికంగా పశ్చిమ గోదావరి జిల్లాలో 862 కేసులు రాగా, అత్యల్పంగా శ్రీకాకుళం జిల్లాలో 139 మందికి కరోనా సోకినట్టు వెల్లడైంది. అదే సమయంలో రాష్ట్రంలో మరో 31 మంది కరోనాతో మరణించారు. గరిష్టంగా ప్రకాశం జిల్లాలో ఐదుగురు మృత్యువాత పడ్డారు. తాజాగా 6,110 మంది కరోనా నుంచి కోలుకున్నారని తాజా బులెటిన్ లో వెల్లడించారు.

ఓవరాల్ గణాంకాలు చూస్తే... రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 7,44,864కి చేరింది. ఇప్పటివరకు 6,91,040 మంది కరోనా నుంచి విముక్తులయ్యారు. ఇంకా 47,665 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 6,159కి పెరిగింది.

Andhra Pradesh
Corona Virus
Samples
Positive Cases
Deaths

More Telugu News