Shivraj Singh Chauhan: రాహుల్ గాంధీకి ఉల్లిగడ్డ భూమిలో పెరుగుతుందో, బయట పెరుగుతుందో కూడా తెలియదు: శివరాజ్ సింగ్

Madhya Pradesh CM Shivraj Singh ridicules Rahul Gandhi over farming
  • కేంద్ర వ్యవసాయ బిల్లులపై కాంగ్రెస్ వ్యతిరేకత
  • ట్రాక్టర్ యాత్రలు చేస్తున్న రాహుల్
  • రాహుల్ కు వ్యవసాయం గురించి ఏం తెలుసన్న మధ్యప్రదేశ్ సీఎం
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ సెటైర్లు వేశారు. ట్రాక్టర్లపై తిరిగినంత మాత్రాన వ్యవసాయం గురించి తెలుసుకోలేరని, సోఫాలపై కూర్చునే రాహుల్ గాంధీ వ్యవసాయ చట్టంపై విమర్శలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు. చివరికి ఉల్లిగడ్డ భూమి లోపల పెరుగుతుందో, బయట పెరుగుతుందో కూడా తెలియదని ఎద్దేవా చేశారు.

ఎన్డీయే సర్కారు తీసుకువచ్చిన వ్యవసాయ బిల్లులను కాంగ్రెస్ తీవ్రంగా విమర్శిస్తుండడాన్ని శివరాజ్ సింగ్ చౌహన్ ఈ విధంగా తిప్పికొట్టే ప్రయత్నం చేశారు. రాహుల్ కు కనీసం వ్యవసాయంలో ఒక్క విషయం అయినా తెలుసా? అని ప్రశ్నించారు.

ఖేతీ బచావో యాత్ర పేరిట కేంద్రం బిల్లులపై నిరసనలు తెలుపుతూ రాహుల్ పంజాబ్ లో ట్రాక్టర్ యాత్ర నిర్వహించిన సంగతి తెలిసిందే. అటు, కేంద్రమంత్రి స్మృతి ఇరానీ కూడా రాహుల్ ను వీఐపీ రైతు అంటే హేళన చేశారు. ట్రాక్టర్ పై మెత్తని పరుపు వంటి ఆసనంపై రాహుల్ కూర్చుని ఉన్న ఫొటోలు వైరల్ అవుతున్న నేపథ్యంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.
Shivraj Singh Chauhan
Rahul Gandhi
Agri BIlls
Tractor
Sofa
Congress
BJP

More Telugu News