Nara Lokesh: అనపర్తిలో 9 ఏళ్ల బాలిక అత్యాచారానికి గురయ్యింది: నారా లోకేశ్ ఆగ్రహం

lokesh slams ap govt
  • దిశ చట్టం నిద్రపోతుందా వైఎస్ జగన్ గారు?
  • తూర్పు గోదావరి జిల్లా అనపర్తిలో దారుణం
  • చిన్నారిని చిదిమేసిన మృగాడు సత్యనారాయణ రెడ్డి
  • కఠినంగా శిక్షించాల్సింది పోయి రాజీ కుదిర్చే ప్రయత్నం  
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై టీడీపీ నేత నారా లోకేశ్ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఏపీలో అమ్మాయిలపై అత్యాచారాలు జరుగుతుంటే పట్టించుకోవట్లేదని మండిపడ్డారు. అనపర్తిలో బాలికపై అత్యాచారం చేసిన నిందితుడిని శిక్షించకుండా, రాజీ చేసే ప్రయత్నాలు చేస్తున్నారంటూ ఆయన ఆరోపణలు గుప్పించారు.

‘దిశ చట్టం నిద్రపోతుందా వైఎస్ జగన్ గారు? తూర్పు గోదావరి జిల్లా అనపర్తిలో 9 ఏళ్ల బాలిక అత్యాచారానికి గురయ్యింది. చిన్నారిని చిదిమేసిన మృగాడు సత్యనారాయణ రెడ్డిని కఠినంగా శిక్షించాల్సింది పోయి, స్థానిక వైకాపా నేతలు రాజీ కుదిర్చే ప్రయత్నం చెయ్యడం దారుణం’ అని నారా లోకేశ్ చెప్పారు.

‘చిన్నారిపై అత్యాచారానికి పాల్పడిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలి. రాష్ట్రంలో మహిళలకు అసలు రక్షణ ఉందా? 21 రోజుల్లో న్యాయం ఎక్కడ? ప్రచార ఆర్భాటంతో మొదటి దిశ పోలీస్ స్టేషన్ ప్రారంభించిన జిల్లాలోనే ఘోరాలు జరుగుతుంటే ఇక మిగిలిన చోట్ల ఎంత దారుణమైన పరిస్థితి ఉందో అర్థమవుతుంది‘ అని లోకేశ్ తెలిపారు.

Nara Lokesh
Telugudesam
Crime News

More Telugu News