Rashmika Mandanna: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం  

Rashmika happy as her first Tamil film shoot is over
  • రష్మిక తమిళ సినిమా పూర్తయిందట!
  • రజనీకాంత్ సినిమా మరింత ఆలస్యం
  • హైదరాబాదులో శర్వానంద్ 'శ్రీకారం'  
*  అందాల కథానాయిక రష్మిక నటిస్తున్న తొలి తమిళ చిత్రం 'సుల్తాన్'. కార్తీ హీరోగా భాగ్యరాజ్ కన్నన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం బ్యాలెన్స్ షూటింగ్ నిన్నటితో ముగిసింది. ఈ చిత్రం షూటింగ్ పూర్తవడంతో రష్మిక తన సంతోషాన్ని వ్యక్తం చేసింది.
*  తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా శివ దర్శకత్వంలో రూపొందుతున్న అన్నాత్తే చిత్రం షూటింగ్ ఇప్పట్లో ప్రారంభమయ్యేలా లేదు. చెన్నైలో ఈ చిత్రం షూటింగ్ త్వరలోనే మొదలవుతుందంటూ ఇటీవల వార్తలొచ్చాయి. అయితే, హీరోయిన్లు మీనా, కీర్తి సురేశ్ ఇతర సినిమాల షూటింగుల్లో బిజీగా ఉండడం వల్ల అన్నాత్తే మరింత ఆలస్యం అవుతుందని తెలుస్తోంది.
*  శర్వానంద్ హీరోగా కిషోర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న 'శ్రీకారం' చిత్రం తదుపరి షూటింగ్ నిన్నటి నుంచి హైదరాబాదులో జరుగుతోంది. కథానాయిక ప్రియాంక అరుల్ మోహన్ కూడా షూటింగులో జాయిన్ అయింది.
Rashmika Mandanna
Karthi
Rajanikanth
Keerti Suresh

More Telugu News