కీలక పదవి కోసం పోటీ పడుతున్న అరుణ్ జైట్లీ కుమారుడు
- డీడీసీఏ అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న రోహన్ జైట్లీ
- సంపూర్ణ మద్దతు ప్రకటించిన డీడీసీఏ సభ్యులు
- అప్పుడే వెల్లువెత్తుతున్న శుభాకాంక్షలు
మరోవైపు, రోహన్ గెలుపు నల్లేరుపై నడకే కాబోతోంది. డీడీసీఏలోని సభ్యులు ఆయనకు సంపూర్ణ మద్దతును ప్రకటించారు. ఈ నేపథ్యంలో, ఆయనకు అప్పుడే శుభాభినందనలు ప్రారంభమయ్యాయి. డీడీసీఏ అధ్యక్షుడిగా 1999 నుంచి 2003 వరకు అరుణ్ జైట్లీ సేవలందించారు. ఆ కారణం వల్లే ఆయన చనిపోయిన తర్వాత ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా గ్రౌండ్ కు అరుణ్ జైట్లీ పేరు పెట్టారు. ఇప్పటికే కేంద్ర హోంమంత్రి అమిత్ షా కుమారుడు జై షా బీసీసీఐ కార్యదర్శిగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.