Raghu Rama Krishna Raju: రేపు నా 'రచ్చబండ'ను ఎవరూ మిస్ కావొద్దు... చాలా ఇంట్రెస్టింగ్ అంశాలున్నాయి: రఘురామకృష్ణరాజు

Raghurama Krishna Raju says do not miss his Rajadhani Ratchha Banda tomorrow
  • ఢిల్లీలో రోజూ మీడియా సమావేశం పెడుతున్న రఘురామ
  • వైసీపీ హైకమాండ్ పై తీవ్రస్థాయిలో విమర్శలు
  • వైసీపీకి, రఘురామకు మధ్య పూడ్చలేని అంతరం
నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు గతకొంతకాలంగా వైసీపీ అధినాయకత్వంతో తీవ్ర పోరాటం సాగిస్తున్నారు. తనకు బెదిరింపులు వస్తున్నాయంటూ సొంత నియోజకవర్గం నుంచి ఢిల్లీ వెళ్లిపోయిన ఆయన అక్కడే కేంద్ర బలగాల భద్రత నడుమ మనుగడ సాగిస్తున్నారు. ఈ క్రమంలో రాజధాని రచ్చబండ పేరుతో దాదాపు ప్రతిరోజూ మీడియా సమావేశాలు ఏర్పాటు చేస్తున్న రఘురామకృష్ణరాజు... సీఎం జగన్, విజయసాయి, వైసీపీ మంత్రులపై తీవ్రస్థాయిలో విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు.

ఈ క్రమంలో ఆయన తాజాగా ఓ ఆసక్తికర ట్వీట్ చేశారు. "రేపు మధ్యాహ్నం 1 గంటకు నేను రాజధాని రచ్చబండ లైవ్ కార్యక్రమంలో పాల్గొంటున్నాను. రేపు చాలా ఆసక్తికర అంశాలు వెల్లడించబోతున్నాను... ఎవరూ మిస్ కావొద్దు!" అంటూ పోస్ట్ పెట్టారు.

ఇవాళ తన నివాసాలు, ఆఫీసులపై సీబీఐ దాడులు అంటూ అసత్య ప్రచారం చేశారంటూ రఘురామకృష్ణరాజు ఇప్పటికే ఖండించారు. తనకు సంబంధించి ఎక్కడా ఎలాంటి సోదాలు జరగలేదని ఆయన స్పష్టం చేశారు. నానాటికీ రఘురామకృష్ణరాజుకు, వైసీపీ నేతలకు మధ్య అంతరం పెరుగుతోందే తప్ప తగ్గడం లేదన్నదానికి తాజా పరిణామాలే నిదర్శనం.
Raghu Rama Krishna Raju
Rajadhani Ratchha Banda
YSRCP
Delhi
Andhra Pradesh

More Telugu News