Sekhar Kammula: గ్రీన్ ఇండియా చాలెంజ్ ను స్వీకరించిన శేఖర్ కమ్ముల

Tollywood director Sekhar Kammula accepts Green India Challenge
  • లవ్ స్టోరీ సెట్స్ పై ఉన్న శేఖర్ కమ్ముల
  • కనకమామిడి గ్రామంలో మొక్కలు నాటిన వైనం
  • తన యూనిట్ సభ్యులను నామినేట్ చేసిన దర్శకుడు
టాలీవుడ్ దర్శకుడు శేఖర్ కమ్ముల పర్యావరణ హిత గ్రీన్ ఇండియా చాలెంజ్ ను స్వీకరించారు. ఈ చాలెంజ్ లో భాగంగా ఆయన మొక్కలు నాటారు. ప్రస్తుతం ఆయన 'లవ్ స్టోరీ' షూటింగ్ కోసం మొయినాబాద్ మండలం కనకమామిడి గ్రామంలో ఉన్నారు. ఆ గ్రామంలోని ఓ దారికి ఇరువైపులా మొక్కలు నాటారు. ఈ సందర్భంగా శేఖర్ కమ్ముల... టీఆర్ఎస్ ఎంపీ సంతోష్ కుమార్ పై అభినందనల జల్లు కురిపించారు.

పర్యావరణంపై అవగాహన కల్పించేలా ఎంతో మంచి కార్యక్రమాన్ని తీసుకువచ్చారని కొనియాడారు. గ్రీన్ ఇండియా చాలెంజ్ లో భాగంగా శేఖర్ కమ్ముల తన యూనిట్ సభ్యులందరినీ నామినేట్ చేశారు. ఈ పర్యావరణ హిత గొలుసును మరింత ముందుకు తీసుకెళ్లాలని ఆయన సూచించారు.
Sekhar Kammula
Green India Challenge
Kanakamamidi
Saplings
Tollywood

More Telugu News