Raghavendra Rao: రేపు కొత్త సినిమా ప్రకటన చేయనున్న దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు

Senior Director Raghavendra Rao will be announced his new project tomorrow
  • మూడేళ్లుగా సినిమా జోలికి వెళ్లని దర్శకేంద్రుడు
  • రేపు ఉదయం 11.30 గంటలకు ముహూర్తం ఖరారు
  • కొత్తవాళ్లతో దర్శకేంద్రుడి చిత్రం?
టాలీవుడ్ దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు ఓ కొత్త చిత్రం ప్రారంభిస్తున్నారు. రేపు తన చిత్రాన్ని అధికారికంగా ప్రకటిస్తానని రాఘవేంద్రరావు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. అక్టోబరు 9న ఉదయం 11.30 గంటలకు తన నూతన చిత్ర ప్రకటన ఉంటుందని వివరించారు. దర్శకేంద్రుడు చివరిసారిగా 2017లో అక్కినేని నాగార్జున ప్రధానపాత్రలో 'ఓం నమో వేంకటేశాయ' చిత్రాన్ని తెరకెక్కించారు. ఆ తర్వాత ఆయన ఇప్పటివరకు మెగాఫోన్ పట్టుకోలేదు.

ఇప్పుడు తాజాగా కొత్త వాళ్లతో సినిమా తీయాలని రాఘవేంద్రరావు ఫిక్స్ అయినట్టు ఫిలింనగర్ సర్కిల్స్ లో ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాకు ఆయనే నిర్మాత అని సమాచారం. రాఘవేంద్రరావు ఆస్థాన సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి ఈ చిత్రానికి కూడా సంగీతం అందిస్తారని తెలుస్తోంది.
Raghavendra Rao
New Movie
Announcement
Tollywood

More Telugu News