Mohmood Ali: హోంమంత్రి మహమూద్ ఆలీ ఇంట్లోకి చొరబడేందుకు యత్నించిన వందలాది కాంగ్రెస్ కార్యకర్తలు

Hundreds of Congress workers tried to get in to TS Home Ministers home
  • అత్యాచారాలు, హత్యలకు నిరసనగా ముట్టడి
  • ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు
  • కార్యక్రమంలో పాల్గొన్న భట్టి, సంపత్
తెలంగాణ హోంమంత్రి మహమూద్ అలీ నివాసం వద్ద ఈరోజు కాంగ్రెస్ కార్యకర్తలు హల్ చల్ చేశారు. మినిస్టర్స్ క్వార్టర్స్ గేట్లను తన్నుకుని లోపలకు చొరబడ్డ కార్యకర్తలు... అలీ నివాసాన్ని ముట్టడించారు. ఆయన ఇంట్లోకి కూడా చొరబడేందుకు యత్నించారు.

రాష్ట్రంలో జరుగుతున్న అత్యాచారాలు, హత్యలపై నిరసనకు దిగారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఖమ్మం, మొయినాబాద్ అత్యాచారాలపై ఆందోళన చేపట్టారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్, యూత్ కాంగ్రెస్ కు చెందిన వందలాది మంది పాల్గొన్నారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎమ్మెల్యే సంపత్ కూడా వీరితో పాటు కలిసి వచ్చారు. ఈ సందర్భంగా అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.
Mohmood Ali
TRS
Mallu Bhatti Vikramarka
Sampath
Congress

More Telugu News