GVL Narasimha Rao: మిర్చి టాస్క్ ఫోర్స్ చైర్మన్ హోదాలో తొలిసారి గుంటూరు మిర్చి యార్డును సందర్శించిన జీవీఎల్

Spices Board Task Force Chairman GVL Narasimha Rao visits Guntur mirchi yard
  • ఇటీవలే స్పైస్ బోర్డు టాస్క్ ఫోర్స్ చైర్మన్ గా జీవీఎల్ నియామకం
  • నేడు గుంటూరు విచ్చేసిన జీవీఎల్
  • మిర్చి రైతులతో సమావేశం
బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు ఇటీవల మిర్చి, ఇతర సుగంధ ద్రవ్యాల  బోర్డు టాస్క్ ఫోర్స్ చైర్మన్ గా నియమితులయ్యారు. ఈ క్రమంలో ఆయన ఇవాళ గుంటూరు విచ్చేశారు. మిర్చి టాస్క్ ఫోర్స్ చైర్మన్ హోదాలో మొట్టమొదటి సారిగా గుంటూరు మిర్చి యార్డును సందర్శించారు. మిర్చి పంట గురించి, ధరల పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మిర్చి రైతులతో జీవీఎల్ సమావేశం నిర్వహించారు. ఇటీవల పార్లమెంటు ఉభయసభల్లో ఆమోదం పొందిన వ్యవసాయ బిల్లుతో రైతులు అపరిమిత ప్రయోజనాలు పొందుతారని ఆయన వివరించారు.

అంతకుముందు జీవీఎల్ మాజీ మంత్రి రావెల కిశోర్ బాబుతో కలిసి ఏపీ బీజేపీ మాజీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ నివాసానికి వెళ్లారు. కన్నాతో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. తాజా పరిస్థితులపై కాసేపు చర్చించుకున్నారు.
GVL Narasimha Rao
Mirchi Yard
Guntur
Spices Board
Task Force
Chairman
BJP

More Telugu News