Shruti Hassan: తండ్రికి తన సపోర్ట్ లేదంటోన్న శ్రుతిహాసన్!

Shruti Hassan says she will not campain for his father in elections
  • రాజకీయాలు సరిపడవంటున్న శ్రుతి 
  • తన తండ్రి కూడా అడగరని వ్యాఖ్య
  • ఎన్నికల్లో ప్రచారం చేయనన్న శ్రుతి  
తనకు రాజకీయాలు సరిపడవంటోంది అందాలతార శ్రుతిహాసన్. అందుకే, వచ్చే ఎన్నికల్లో తన తండ్రి తరఫున ప్రచారం చేసేది లేదని తెగేసి చెప్పింది. ప్రముఖ నటుడు కమలహాసన్ ఆమధ్య 'మక్కల్ నీది మయ్యమ్' పేరిట రాజకీయ పార్టీని నెలకొల్పి, వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికలలో పోటీకి దిగుతున్న సంగతి విదితమే.

ఈ సందర్భంగా తండ్రి రాజకీయాల గురించి ఆమె వద్ద ప్రస్తావిస్తే శ్రుతి స్పందించింది. ప్రజలకు ఏదో సేవ చేయాలన్న ఆశ, తపన తన తండ్రిలో ఉన్నాయనీ, అందుకే ఆయన రాజకీయాల్లోకి వచ్చారని, అయితే తనకు రాజకీయాలు సరిపడవని శ్రుతి చెప్పింది. అందుకే, తండ్రి తరఫున ఎన్నికల ప్రచారం చేయనని, ఆయన కూడా ఈ విషయంలో తనని అడగరనీ చెప్పింది.

ప్రస్తుతం తెలుగులో 'వకీల్ సాబ్' చిత్రంతో పాటు 'క్రాక్' సినిమాలో శ్రుతి కథానాయికగా నటిస్తోంది. మరోపక్క, తమిళంలో విజయ్ సేతుపతి హీరోగా రూపొందుతున్న 'లాభమ్' సినిమాలో కథానాయికగా నటిస్తోంది. ప్రస్తుతం చెన్నై శివారుల్లో జరుగుతున్న ఈ చిత్రం షూటింగులో ఆమె పాల్గొంటోంది. గ్రామీణ నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రంలో శ్రుతి డ్యాన్సర్ పాత్రలో నటిస్తోందట.
Shruti Hassan
Kamala Hassan
Assembly Elections

More Telugu News