Prabhas: విజయదశమికి ప్రభాస్ అభిమానులకు ట్రీట్!

Teaser from Radhe Shyam for Vijaya Dashami
  • ప్రస్తుతం మూడు సినిమాలతో ప్రభాస్ బిజీ 
  • ఇటలీలో 'రాధే శ్యామ్' షూటింగ్
  • దసరాకు 'రాధే శ్యామ్' టీజర్, ఇతర సినిమాల అప్ డేట్స్  
సౌత్ లోనే కాకుండా నార్త్ లో కూడా మంచి ఇమేజ్, ఫాలోయింగ్ తెచ్చుకున్న హీరో ప్రభాస్ సినిమాలు చేయడంలో ఈమధ్య స్పీడు పెంచాడు. ప్రస్తుతం మూడు సినిమాలు లైన్లో వున్నాయి. ఇప్పటికే 'రాధే శ్యామ్' సెట్స్ లో ఉండగా, నాగ్ అశ్విన్ సినిమా, ఆదిపురుష్ సినిమా ఆ తర్వాత వరుసగా సెట్స్ కి వెళ్లడానికి సిద్ధంగా వున్నాయి.

ఇక రాధాకృష్ణకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న 'రాధే శ్యామ్' సినిమా షూటింగును ప్రస్తుతం ఇటలీలో నిర్వహిస్తున్నారు. పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన అప్ డేట్స్ ఏమీ ఈమధ్య నిర్మాతల నుంచి అధికారికంగా లేవు. మరోపక్క, నాగ్ అశ్విన్ సినిమా, 'ఆదిపురుష్' సినిమాలకు సంబంధించిన అప్ డేట్స్ అప్పుడప్పుడు వస్తున్నాయి. దీంతో 'రాధే శ్యామ్' ప్రమోషన్ పరంగా కాస్త వెనుకపడింది.

ఈ నేపథ్యంలో ప్రభాస్ అభిమానులను ఖుషీ చేయడానికి విజయదశమికి 'రాధే శ్యామ్' నుంచి టీజర్ ను వదలడానికి సిద్ధం చేస్తున్నారట. అలాగే, ఆ పండగ సందర్భంగా నాగ్ అశ్విన్ సినిమా, 'ఆదిపురుష్' సినిమాల నుంచి కూడా అప్ డేట్స్ వుంటాయని తెలుస్తోంది. మొత్తానికి దసరాకు ప్రభాస్ అభిమానులకు ఈ మూడు సినిమాల నుంచీ మంచి ట్రీట్ ఉంటుందని అంటున్నారు.    
Prabhas
Pooja Hegde
Radhe Shyam

More Telugu News