White House: రిస్క్ ఉందని తెలుసు... అయినా వెనక్కు తగ్గబోను: డొనాల్డ్ ట్రంప్

Trump Says that he dont care Corona Risk
  • 15న బైడెన్ తో డిబేట్ లో పాల్గొంటా
  • నేను చేసినట్టుగా ఎవరూ చేయలేరన్న ట్రంప్
  • తీవ్ర ఆందోళనలో వైట్ హౌస్ సిబ్బంది
  • సీక్రెట్ సర్వీస్ సిబ్బందిలో పలువురికి కరోనా
కరోనా పూర్తిగా తగ్గకపోయినా, మాస్క్ తీసేసి తిరుగుతూ, వైట్ హౌస్ సిబ్బందిని భయాందోళనలకు గురి చేస్తున్న ట్రంప్, తాను ఫిట్ గా ఉన్నానని చెప్పడానికి చాలా కష్టపడుతున్నారు. ఆయన గొంతులో మునుపటి ఉత్సాహం కనిపించడం లేదని, అధికంగా ఊపిరి తీసుకుంటున్నారని పరిశీలకులు అంటున్నారు. రెండు లక్షల మందికి పైగా చనిపోయినా భయపడాల్సిన అవసరం లేదని తన ట్విట్టర్ ఖాతాలో ట్రంప్ వ్యాఖ్యానించారు.

"రిస్క్ ఉందని నాకు తెలుసు. ఇప్పుడు మరింత మెరుగ్గా ఉన్నాను. నా శరీరంలో వ్యాధి నిరోధకత ఉండి ఉండవచ్చు. నేను చేసినట్టుగా ఏ నాయకుడూ చేయలేడు. నేను వెనక్కు తగ్గబోను. నా ప్రత్యర్థి బైడెన్ తో 15న జరుగనున్న మియామీ డిబేట్ లో పాల్గొనేందుకు సిద్ధంగా ఉన్నాను. నేనే ముందుంటాను. నేనే నాయకత్వం వహిస్తాను" అని వ్యాఖ్యానించారు.

ఇదిలావుండగా, ట్రంప్ ఇంకా పూర్తిగా కోలుకోలేదని, ఆయన కోలుకునేందుకు మరో వారం రోజుల సమయమన్నా పడుతుందని ట్రంప్ ప్రత్యేక వైద్యుడు డాక్టర్ సీన్ కాన్లే వ్యాఖ్యానించారు. ట్రంప్ కు ఇప్పటివరకూ నాలుగు డోస్ ల రెమిడెసివిర్ ను వైద్యులు ఇచ్చారని అన్నారు. ఇతరులకు వ్యాధి వ్యాపించకుండా ఉండాలంటే, కరోనా బారిన పడిన వారు కనీసం 10 రోజులు ఐసోలేషన్ లో ఉండాలని నిపుణులు చెబుతున్నా, వాటిని ఖాతరు చేయని ట్రంప్ యథేచ్ఛగా వైట్ హౌస్ లో తిరుగుతుంటే, ఉద్యోగులంతా తీవ్ర ఆందోళనలో ఉన్నారు.

ఈ వారం రోజుల వ్యవధిలో వైట్ హౌస్ లో డజను మందికి పైగా కరోనా సోకింది. అంటే, బాధితులకు దాదాపు ట్రంప్ ఆసుపత్రికి వెళ్లకముందే వైరస్ సోకి ఉంటుంది. అమెరికాలోనే అత్యంత సురక్షిత ప్రాంతంగా గుర్తింపు ఉన్న వైట్ హౌస్,ఇప్పుడు కరోనాకు హాట్ స్పాట్ గా మారిందని అంటున్నారు. ఇక సీక్రెట్ సర్వీస్ సిబ్బందిలో పలువురికి వైరస్ సోకినట్టుగా తెలుస్తుండగా, ఎంతమంది మహమ్మారి బారిన పడ్డారన్న విషయాన్ని వెల్లడించేందుకు ఉన్నతాధికారులు నిరాకరిస్తున్నారు.
White House
Donald Trump
Corona Virus

More Telugu News