Jagan: ఢిల్లీ నుంచి గన్నవరం చేరుకున్న ఏపీ ముఖ్యమంత్రి జగన్‌

jagan reaches gannavaram
  • ఢిల్లీ పర్యటించిన జగన్
  • ప్రధాని మోదీతో చర్చలు
  • తాడేపల్లికి పయనమైన జగన్
ఢిల్లీ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీతో ఏపీ సీఎం జగన్ భేటీ అయిన విషయం తెలిసిందే. ఈ సమావేశం అనంతరం ఆయన వీడియో కాన్సరెన్స్‌ ద్వారా అపెక్స్‌ కౌన్సిల్‌ భేటీలో పాల్గొని తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న నదీ జలాల సమస్యలపై చర్చించారు. ఈ సమావేశం ముగిసిన అనంతరం  ఢిల్లీ నుంచి బయలు దేరి ఆంధ్రప్రదేశ్‌కు చేరుకున్నారు.  

ఢిల్లీ నుంచి గన్నవరం విమానాశ్రయంలో దిగిన వెంటనే ఆయన  అక్కడ నుంచి తాడేపల్లిలో తన నివాసానికి వెళ్లారు. కాగా, ఢిల్లీలో మోదీతో జగన్ దాదాపు 50 నిమిషాల పాటు చర్చించారు. రాష్ట్రానికి సంబంధించిన 17 అంశాలపై జగన్ ప్రధానికి నివేదించినట్లు తెలిసింది. ఆయన వెంట పలువురు వైసీపీ నేతలు కూడా ఉన్నారు. ఎన్డీఏలో వైసీపీ చేరుతుందన్న ఊహాగానాల మధ్య వీరిద్దరి సమావేశం ప్రాధాన్యతను సంతరించుకుంది.
Jagan
YSRCP
Andhra Pradesh

More Telugu News