పోలీసుల మనోభావాలను దెబ్బతీసేలా చంద్రబాబు లేఖ ఉంది: డీఐజీ పాలరాజు
- ఎన్సీఆర్బీలో పొరపాట్లను అందరూ గుర్తించారు
- చంద్రబాబు మాత్రమే గుర్తించలేదు
- చంద్రబాబు విజ్ఞతతో ఆలోచించాలి
నేషనల్ క్రైమ్ రిపోర్ట్ బ్యూరో (ఎన్సీఆర్బీ)లో పొరపాట్లను అందరూ గుర్తించారని... చంద్రబాబు మాత్రమే గుర్తించలేదని చెప్పారు. చంద్రబాబు విజ్ఞతతో ఆలోచించాలని అన్నారు. రాష్ట్రంలో పోలీసులు ఎంతో అప్రమత్తంగా పని చేస్తున్నారని... ఈ విషయాన్ని కూడా చంద్రబాబు గుర్తించాలని అన్నారు. టీడీపీ నాయకుడు పట్టాభి కారుపై దాడి చేసిన దుండగులను పట్టుకుంటామని చెప్పారు. పట్టాభి ఇంట్లో సీసీ కెమెరాలు పని చేయడం లేదని తెలిపారు.