Shruthi Haasan: నా వ్యాఖ్యలను తెలుగు మీడియా తప్పుగా అన్వయించింది: శ్రుతిహాసన్

Shruthi Haasan says certain Telugu media publications misinterpreted her one of her quotes
  • ఇటీవల జాతీయ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చిన శ్రుతి
  • అవాస్తవ కథనాలు అంటూ తెలుగు మీడియాపై అసంతృప్తి
  • టాలీవుడ్ అంటే ఎంతో గౌరవం ఉందన్న శ్రుతి
ప్రముఖ హీరోయిన్ శ్రుతి హాసన్ కొన్ని తెలుగు మీడియా సంస్థలపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇటీవల తాను ఓ జాతీయ మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చానని, అందులో తాను పేర్కొన్న అంశాన్ని కొన్ని తెలుగు మీడియా సంస్థలు తప్పుగా అన్వయించాయని ఆరోపించారు. ఆ అంశంపై సదరు తెలుగు మీడియా సంస్థల నుంచి వచ్చిన కథనాలు అవాస్తవమని స్పష్టం చేశారు.

తెలుగు చిత్ర పరిశ్రమ అంటే తనకు ఎంతో గౌరవం ఉందని శ్రుతి హాసన్ ఉద్ఘాటించారు. రేసుగుర్రం, పవన్ కల్యాణ్ తో చేసిన గబ్బర్ సింగ్ వంటి చిత్రాల్లో భాగమైనందుకు ఎంతో గర్విస్తున్నానని వివరించారు. అలాంటి తెలుగు సినిమాలతోనే తనకు స్టార్ డమ్ వచ్చిందని శ్రుతి వెల్లడించారు.
Shruthi Haasan
Telugu Media
Quote
Interview
Tollywood

More Telugu News