ప్రియురాలిని పెళ్లాడిన అన్నాడీఎంకే ఎమ్మెల్యే ప్రభు!

  • ఏడాదిన్నరగా సౌందర్యతో ప్రేమ
  • నిరాడంబరంగా వివాహం
  • అభినందనలు తెలిపిన పలువురు
తమిళనాడులోని కళ్లకురిచ్చి ఎమ్మెల్యే, అన్నాడీఎంకే నేత, తాను మనసిచ్చిన యువతిని లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. త్యాగదుర్గం మలైకొటై గ్రామానికి చెందిన సౌందర్య అనే బీఏ ఇంగ్లీష్ రెండో సంవత్సరం చదువుతున్న యువతిని గడచిన ఏడాదిన్నరగా ప్రేమిస్తున్న ఎమ్మెల్యే ప్రభు, రెండు కుటుంబాల సమ్మతితో ఈ వివాహం చేసుకున్నారు.

కరోనా నేపథ్యంలో, తక్కువ మంది అతిథుల మధ్య, నిరాడంబరంగా ఈ వివాహం జరిగింది. సౌందర్య తండ్రి గ్రామంలో అర్చకుడిగా పని చేస్తున్నారు. నూతన దంపతులకు పలువురు రాజకీయ నాయకులు ఆశీస్సులు, అభినందనలు అందించారు.

Prabhu
AIADMK
Love Marriage

More Telugu News