Sonia Agarwal: నయనతార, త్రిషలను వదిలేసి నన్నే ఎందుకు అడుగుతారు?: సోనియా అగర్వాల్‌

I wont accept mother characters says Sonia Agarwal
  • అమ్మ పాత్ర చేయమని దర్శకనిర్మాతలు అడుగుతున్నారు
  • నయన్, త్రిష, నేను ముగ్గురూ ఒకే సారి ఇండస్ట్రీలోకి వచ్చాం
  • నేను ఇప్పటికీ ఫిట్ గా, అందంగా ఉన్నా
'7/జి బృందావన్ కాలనీ'తో పాటు పలు సినిమాల్లో నటించి, మెప్పించిన హీరోయిన్ సోనియా అగర్వాల్ తాజాగా ఒక విషయం పట్ల తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. తనను అమ్మ పాత్రల్లో నటించమని దర్శకనిర్మాతలు అడుగుతుండటం ఆశ్చర్యంగా ఉందని చెప్పింది.

తాను, నయనతార, త్రిష ముగ్గురం ఒకేసారి సినీ ఇండస్ట్రీలోకి ప్రవేశించామని తెలిపింది. కానీ తనను మాత్రమే అమ్మ పాత్రలు చేయమని అడుగుతున్నారని... వాళ్లను ఎందుకు అడగడం లేదని ప్రశ్నించింది. తాను ఇప్పటికీ ఎంతో ఫిట్ గా ఉన్నానని, హీరోయిన్ పాత్రలు చేసేంత గ్లామర్ తనలో ఉందని చెప్పింది. రాధిక, ఖుష్బూల మాదిరి వయసు పెరిగిన తర్వాత అమ్మ పాత్రల్లో నటిస్తానని తెలిపింది. ఇప్పట్లో తాను అమ్మ పాత్రల్లో నటించబోనని చెప్పింది.
Sonia Agarwal
Tollywood
Kollywood

More Telugu News