Vijay Devarakonda: యూరప్ లో హాలిడే ఎంజాయ్ చేస్తున్న విజయ్ దేవరకొండ!

Vijay Devarakonda holiday trip in Europ
  • అప్పుడప్పుడు ఆర్టిస్టుల హాలిడే ట్రిప్స్ 
  • యూరప్ లో తిరుగుతున్న విజయ్
  • అక్కడి ఫొటోలు పోస్ట్ చేస్తున్న వైనం
హైదరాబాదులో షూటింగులలో పాల్గొనడానికే చాలా మంది హీరోలు భయపడుతున్న ప్రస్తుత సమయంలో, ఏకంగా విదేశాలలో హాలిడే ట్రిప్ ఎంజాయ్ చేస్తున్నాడు మన యంగ్ హీరో విజయ్ దేవరకొండ. ఎప్పుడూ షూటింగులతో బిజీబిజీగా వుండే ఆర్టిస్టులు కాస్తంత సేదదీరడం కోసం అప్పుడప్పుడు హాలిడే స్పాట్ లకు వెళ్లి ఎంజాయ్ చేయడం మనం చూస్తూనే ఉంటాం. అయితే, గత ఆరు నెలల నుంచి కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఎక్కడి వారు అక్కడే స్టకప్ అయిపోయారు. ఎక్కడికీ కదల్లేకపోతున్నారు.

ఈ నేపథ్యంలో విజయ్ దేవరకొండ ధైర్యంగా హాలిడే కోసం ప్రస్తుతం యూరప్ లో పర్యటిస్తున్నాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలను సామాజిక మాధ్యమాలలో పోస్ట్ చేస్తున్నాడు కూడా. ఒక్కడూ హాయిగా.. సింపుల్ గా యూరప్ లోని పలు లొకేషన్లలో తిరుగుతూ, అక్కడి రెస్టారెంట్స్ లో ఇష్టమైన ఫుడ్ లాగిస్తూ ఎంజాయ్ చేస్తున్నాడు.

పిచ్చెక్కిపోతున్న పని నుంచి తప్పించుకుని పారిపోయి వచ్చి యూరప్ లో ఎంజాయ్ చేస్తున్నాననీ, మరీ ముఖ్యంగా తాను ఇష్టపడే తిండి కోసం అక్కడికి వచ్చినట్టుగా పేర్కొన్నాడు. అయితే, యూరప్ లోని ఏ దేశాలలో పర్యటిస్తున్నదీ మాత్రం విజయ్ వెల్లడించలేదు.
Vijay Devarakonda
Holiday
Europ
Food

More Telugu News