Nara Lokesh: ఎంతోమంది కరోనా బాధితులకు సేవ చేసిన రాధిక అదే ఆసుపత్రిలో మరణించడం బాధాకరం: లోకేశ్

Nara Lokesh saddened after Tirupathi Covid Centre incident
  • తిరుపతి స్విమ్స్ ఆసుపత్రిలో ప్రమాదం
  • బిల్డింగ్ పెచ్చులు ఊడి కిందపడిన ఘటనలో ఓ ఉద్యోగిని మృతి
  • దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన లోకేశ్
తిరుపతి స్విమ్స్ ఆసుపత్రిలోని పద్మావతి కొవిడ్ సెంటర్ లో బిల్డింగ్ పెచ్చులు ఊడి కిందపడిన ఘటనలో రాధిక అనే అటెండర్ మృత్యువాత పడిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్ స్పందించారు. తిరుపతి స్విమ్స్ పద్మావతి కొవిడ్ సెంటర్ ప్రమాదం బాధాకరమని పేర్కొన్నారు. ఎంతోమంది కరోనా బాధితులకు సేవ చేసిన రాధిక అదే ఆసుపత్రిలో తుదిశ్వాస విడవడం దిగ్భ్రాంతికి గురిచేసిందని వెల్లడించారు. ఆమె మృతి పట్ల సంతాపం తెలియజేస్తున్నానని ట్వీట్ చేశారు.

ఈ ప్రమాదంలో క్షతగాత్రులకు మెరుగైన వైద్య సహాయం అందించాలని తెలిపారు. కొవిడ్ ఆసుపత్రుల్లో వరుస ఘటనలు జరుగుతున్నా ప్రభుత్వం నిర్లక్ష్యం వీడడంలేదని లోకేశ్ ఆరోపించారు. పూర్తికాని భవనంలో కొవిడ్ సెంటర్ ఏర్పాటు చేయడమేంటని ప్రశ్నించారు. ఘటనకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Nara Lokesh
Radhika
Covid Centre
SVIMS
Padmavathi
Tirupati

More Telugu News