Kangana Ranaut: 'తలైవి' షూటింగులో హీరోయిన్ కంగన.. ఫొటోలు ఇవిగో

kangana pics goes viral
  • మళ్లీ షూటింగుల్లో పాల్గొంటోన్న నటులు
  • కరోనా నేపథ్యంలో అనేక జాగ్రత్తలు
  • ఏఎల్ విజ‌య్‌ దర్శకత్వంలో కంగన సినిమా
కరోనా విజృంభణ నేపథ్యంలో దాదాపు ఆరేడు నెలల పాటు షూటింగులకు దూరంగా ఉన్న నటులు మళ్లీ షూటింగుల్లో పాల్గొంటున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను షేర్‌ చేస్తున్నారు. తాజాగా, హీరోయిన్ కంగనా ర‌నౌత్ 'తలైవి' షూటింగ్‌లో పాల్గొంది. ఈ సందర్భంగా తీసుకున్న ఫొటోలను ఆమె ట్విట్టర్‌లో షేర్ చేసింది.

చీరకట్టు, కళ్లజోడుతో ఆమె షూటింగులో పాల్గొంది. కరోనా నేపథ్యంలో సినిమా షూటింగుల్లో అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ సినిమాలోని సీన్‌కు సంబంధించి ద‌ర్శ‌కుడు ఏఎల్ విజ‌య్‌తో ఆమె చర్చిస్తుండగా ఈ ఫొటోలు తీశారు.

నిన్న ఉద‌యం సీన్‌ను వివరిస్తోన్న సమయంలో ఈ ఫోటోలు దిగానని ఆమె చెప్పింది. ప్ర‌పంచంలో అత్యద్భుత‌మైన ప్ర‌దేశాలు ఎన్నో ఉంటాయని, అయితే, తనకు చాలా కంఫ‌ర్ట్‌గా ఉండే ప్రదేశం ‌ సినిమా సెట్ అని ఆమె తెలిపింది. కాగా, ప్రస్తుతం ఆమె.. జయ‌ల‌లిత జీవిత చరిత్ర ఆధారంగా రూపుదిద్దుకుంటోన్న 'త‌లైవి' సినిమాతో పాటు పలు సినిమాల్లో నటిస్తోంది.

          
Kangana Ranaut
Bollywood
Tollywood
Viral Pics

More Telugu News