Sanjana Galrani: అండర్ వరల్డ్ డాన్ లతో సంజన, రాగిణిలకు సంబంధాలు!

Sanjana Having Links with Underworld
  • ఐదు రోజులు విచారించిన ఈడీ అధికారులు
  • అండర్ వరల్డ్ తో సంబంధాలున్నాయని అనుమానం
  • విచారణలో పలుమార్లు విలపించిన సంజన
కన్నడనాట తీవ్ర కలకలం రేపిన డ్రగ్స్ కేసులో హీరోయిన్లు సంజనా గల్రానీ, రాగిణి ద్వివేదిలను పరప్పన అగ్రహార జైలులో ఐదు రోజుల పాటు విచారించిన ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు, పలు కీలక విషయాలను రాబట్టినట్టు తెలుస్తోంది. విచారణలో భాగంగా వీరికి పలువురు రౌడీలు, అండర్ వరల్డ్ డాన్ లతో సంబంధాలున్నాయని, ఆ దిశగా లింక్స్ లభించాయని సమాచారం. దీంతో కొందరు రౌడీలపైనా పోలీసులు నిఘా పెట్టారు.

ఇక విచారణలో సంజన పలుమార్లు విలపించిందని ఈడీ వర్గాలు వెల్లడించాయి. ఎన్ని సినిమాలు చేశారు?ఎంత సంపాదించారు? తల్లిదండ్రుల నుంచి ఎంత ఆస్తి వచ్చింది? ఈ మధ్య కాలంలో ఏ ఆస్తులు కొన్నారు వంటి ప్రశ్నలను ఈడీ అధికారులు సంజనపై సంధించారు. పలు భాషల్లో 42 సినిమాల్లో నటించిన సంజన, చిత్ర సీమలో పేరు తెచ్చుకోకున్నా, ఆదాయం విషయంలో మాత్రం చాలా మందికన్నా ముందుందని అధికారులు గుర్తించారు.

ఈ మొత్తం ఆస్తులు ఆమెకు ఎక్కడి నుంచి వచ్చాయన్న విషయాన్ని తేల్చేందుకు ఆదాయపు పన్ను శాఖకు ఈడీ అధికారులు లేఖ రాశారు. ఒకవేళ సంజనకు బెయిల్ లభించి బయటకు వచ్చినా, తదుపరి విచారణ కోసం మరోసారి అదుపులోకి తీసుకోవాలని అధికారులు భావిస్తున్నారు. మరోవైపు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించేందుకు ఈ సినీ తారలు తమ న్యాయవాదులతో సంప్రదింపులు జరుపుతున్నారు.
Sanjana Galrani
Ragini
Underworld
ED
Enquiry

More Telugu News