Surendra Singh: అత్యాచారాలు ఆగాలంటే అమ్మాయిలను విలువలతో పెంచండి: యూపీ బీజేపీ ఎమ్మెల్యే సురేంద్ర సింగ్

Controversy Comments From BJP Leader On Rapes
  • అమ్మాయిలకు మర్యాద నేర్పించండి
  • ప్రభుత్వ రక్షణ మాత్రమే సరిపోదు
  • సురేంద్ర సింగ్ వ్యాఖ్యలపై విమర్శలు
ఉత్తరప్రదేశ్ కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే సురేంద్ర సింగ్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేసి విమర్శలు కొనితెచ్చుకున్నారు. అత్యాచారాలు ఆగిపోవాలంటే, కేవలం ప్రభుత్వ చర్యలు, నిందితులకు శిక్షలు సరిపోవని, తల్లిదండ్రులు తమ కుమార్తెలకు మర్యాద నేర్పించాలని అన్నారు.

బద్లియాకు ఎమ్మెల్యేగా ఉన్న ఆయన, తాజాగా మీడియాతో మాట్లాడారు. అమ్మాయిలను మంచి విలువలతో పెంచాలని అన్నారు. ప్రభుత్వం కేవలం రక్షణ కల్పిస్తుందని, ఆడపిల్లలు మర్యాదగా నడుచుకునేలా పెంచడం తల్లిదండ్రుల కర్తవ్యమని అన్నారు. విలువలున్న యువతతోనే దేశం సస్యశ్యామలం అవుతుందని అన్నారు. ఇప్పటికే హాత్రాస్ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న వేళ, సురేంద్ర సింగ్ చేసిన వ్యాఖ్యలపై పలు విపక్ష పార్టీల నేతలు మండిపడుతున్నారు.
Surendra Singh
Rapes
BJP
Contraversy

More Telugu News