హత్రాస్ కేసును సీబీఐకి అప్పగించడం ద్వారా సరైన నిర్ణయం తీసుకున్నారు: జనసేన
- నాదెండ్ల మనోహర్ నుంచి ప్రకటన
- దోషులకు శిక్ష పడుతుందన్న నమ్మకం ఉందని వెల్లడి
- అందరూ గళం విప్పాలని పిలుపు
అత్యాచార ఘటనలు జరిగినప్పుడు కుల, మత, ప్రాంతాలకు అతీతంగా అందరూ గళం విప్పాలని జనసేన ఆది నుంచి కోరుకుంటోందని తెలిపారు. అమ్మాయిల భద్రతకు ఈ సమాజం భరోసా ఇవ్వాల్సి ఉందని పేర్కొన్నారు. ఏపీలోని కర్నూలుకు చెందిన సుగాలి ప్రీతి అనే బాలిక వ్యవహారంలో జనసేన ఇదే తరహాలో పోరాడుతోందని వివరించారు.
నాడు కర్నూలులో జనసేనాని పవన్ కల్యాణ్ కవాతు చేయడంతో ప్రభుత్వం ఆ కేసును సీబీఐకి అప్పగించిందని, అయితే ఇంతవరకు సీబీఐ నుంచి ఈ కేసుపై అధికారిక ప్రకటన లేదని తెలిపారు.