Botsa: నోటి మాటల ద్వారా మనిషి విలువ తెలుస్తుంది: బొత్స

Botsa comments on Sabbam Hari indirectly
  • సబ్బం హరిపై బొత్స పరోక్ష వ్యాఖ్యలు
  • మనం సభ్య సమాజంలో ఉన్నామని వెల్లడి
  • ఓడినవాళ్లు ఎన్నయినా చెబుతారని ఎద్దేవా
టీడీపీ నేత సబ్బం హరి ఇంటి కూల్చివేత వ్యవహారం మరో రాజకీయ దుమారం రేపింది. ఈ క్రమంలో సబ్బం హరి వైసీపీ అగ్రనేత విజయసాయిరెడ్డిపైనా, మరికొందరు వైసీపీ నేతలపైనా విరుచుకుపడ్డారు. ఈ క్రమంలో ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ పరోక్ష వ్యాఖ్యలు చేశారు. నోటి మాటల ద్వారా మనిషి విలువ తెలుస్తుంది అని అన్నారు.

ముఖ్యంగా, రాజకీయ నాయకుల నోరు అదుపులో ఉండాలని హితవు పలికారు. మనం సభ్య సమాజంలో ఉన్నామన్న విషయాన్ని గుర్తెరగాలని సూచించారు. ఎన్నికల్లో ఓడిపోయిన వాళ్లు ఎన్నిమాటలైనా చెబుతారని ఎద్దేవా చేశారు. ప్రభుత్వ భూముల విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోతుందని, సబ్బం హరి విషయంలోనూ అధికారులు తగిన చర్యలు తీసుకుంటారని స్పష్టం చేశారు.
Botsa
Sabbam Hari
Telugudesam
YSRCP

More Telugu News