Swathi Dekshit: బిగ్ బాస్ సర్ ప్రయిజ్... శనివారమే ఎలిమినేషన్... స్వాతీ దీక్షిత్ అవుట్!

Saturday Elimination in Bigg boss and Swathi Eliminated
  • షాక్ లోకి వెళ్లిపోయిన కంటెస్టెంట్లు
  • స్వాతిని పట్టుకుని ఏడ్చేసిన నోయల్
  • ఇంగ్లీష్ మాట్లాడుతున్న వారికి శిక్ష
టాలీవుడ్ అతిపెద్ద రియాల్టీ షో బిగ్ బాస్ లో, కంటెస్టెంట్లకు పెద్ద షాక్ కలిగింది. సాధారణంగా ఆదివారం నాడు జరగాల్సిన ఎలిమినేషన్ ఒక రోజు ముందే జరిగిపోయింది. నిన్నటి ఎపిసోడ్ లో తొలుత కాయిన్ టాస్క్ గురించి మాట్లాడిన హోస్ట్ నాగ్, ఆ తరువాత తెలుగు షోలో, ఇంగ్లీష్ మాట్లాడుతున్న అభిజిత్, హారికలను శిక్షించారు. ఆపై శనివారం ప్రకటించాల్సిన సేఫ్ జోన్ కంటెస్టెంట్లను ప్రకటించకుండా, డేంజర్ జోన్ లో ఉన్న అందరికీ, తుపాకీ ఇచ్చి కాల్చుకోమన్నాడు. ఎవరు కాల్చుకుంటే శబ్ధం వస్తుందో వారు ఎలిమినేట్ అయినట్టని చెప్పారు.

ఆపై స్వాతీ దీక్షిత్ కాల్చుకోగానే పెద్ద శబ్ధం రావడంతో, ఆమె, తన బట్టలు సర్దుకుని బయటకు వచ్చేయాలని చెప్పడంతో, హౌస్ మేట్స్ అంతా ఒక్కసారిగా దిగ్భాంతికి గురయ్యారు. కొందరైతే స్వాతిని పట్టుకుని ఏడ్చేశారు. ముఖ్యంగా నోయల్ చిన్న పిల్లాడిని తలపించాడు. ఇక నేటి ఎపిసోడ్ లో స్వాతి ఎలిమినేషన్ పై ఏదైనా ట్విస్ట్ ఉంటుందా? మరో కంటెస్టెంట్ ను కూడా ఎలిమినేట్ చేస్తారా? అన్నది ప్రస్తుతానికి సస్పెన్స్.
Swathi Dekshit
Bigg Boss
Saturday
Elimination

More Telugu News