Vaccine: బ్రిటన్ లో మరో మూడు నెలల్లో కరోనా వ్యాక్సిన్!

Corona vaccine will be rolled out in Britain in next three months
  • వ్యాక్సిన్ అభివృద్ధి చేస్తున్న ఆక్స్ ఫర్డ్, ఆస్ట్రాజెనెకా
  • ఈ వ్యాక్సిన్ కు త్వరగా అనుమతులు వచ్చే అవకాశం
  • ఆర్నెల్లలో అందరికీ వ్యాక్సిన్ ఇవ్వాలనుకుంటున్న బ్రిటన్
కరోనాతో తల్లడిల్లిపోతున్న యావత్ ప్రపంచం వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుందా అని వేయి కళ్లతో ఎదురుచూస్తోంది. అనేక దేశాలు కరోనా వ్యాక్సిన్ పరిశోధనల్లో తలమునకలుగా ఉన్నాయి. బ్రిటన్ లో వ్యాక్సిన్ ప్రయోగాలు చివరిదశలో ఉన్నాయి. ప్రఖ్యాత ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ, ఆస్ట్రాజెనెకా ఫార్మా సంస్థతో కలిసి రూపొందించిన కొవిషీల్డ్ వ్యాక్సిన్ ప్రస్తుతం మూడో దశ క్లినికల్ ట్రయల్స్ జరుపుకుంటోంది.

అయితే, టైమ్స్ వార్తాపత్రిక కథనం ప్రకారం బ్రిటన్ లో మరో మూడు నెలల్లో కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి రానుంది. శాస్త్రవేత్తలు ఆక్స్ ఫర్డ్ వ్యాక్సిన్ కోసం ముమ్మరంగా పరిశోధనలు సాగిస్తున్నారని, 2021కి ముందే బ్రిటన్ ఔషధ నియంత్రణ సంస్థ అనుమతులు ఇచ్చే అవకాశాలు ఉన్నాయని టైమ్స్ పేర్కొంది. వచ్చే ఆర్నెల్ల లోపు పిల్లలకు మినహాయించి పెద్దవాళ్లందరికీ ఒక్కో డోసు కరోనా వ్యాక్సిన్ ఇవ్వాలన్నది బ్రిటన్ ఇమ్యూనైజేషన్ కార్యాచరణ అని తెలిపింది.

అటు, యూరోపియన్ మెడిసిన్స్ ఏజెన్సీ (ఈఎంఏ) ఆక్స్ ఫర్డ్, ఆస్ట్రాజెనెకా రూపొందిస్తున్న కొవిడ్-19 వ్యాక్సిన్ కు సంబంధించిన డేటాపై సమీక్షిస్తోంది. యూరప్ ఖండంలో ఓ వ్యాక్సిన్ తీసుకువచ్చే దిశగా ఇదొక సానుకూల పరిణామం అని భావిస్తున్నారు.
Vaccine
Britain
UK
Corona Virus

More Telugu News