Raghu Rama Krishna Raju: మళ్లీ పుట్టిన గాంధీ గారికి నాదో విన్నపం: రఘురామకృష్ణరాజు

Raghurama Krishna Raju comments in CM Jagan
  • గాంధీజీ మళ్లీ పుట్టాడు అంటూ చల్లా రామకృష్ణారెడ్డి వ్యాసం
  • తనదైన శైలిలో స్పందించిన రఘురామకృష్ణరాజు
  • అమరావతి రైతుల అంశాన్ని ప్రస్తావించిన ఎంపీ
వైసీపీ ఎమ్మెల్సీ చల్లా రామకృష్ణారెడ్డి గాంధీ జయంతి సందర్భంగా సీఎం జగన్ ను ఉద్దేశిస్తూ సాక్షి పత్రికలో గాంధీ మళ్లీ పుట్టాడు అనే వ్యాసం రాశారు. దీనిపై నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు తనదైన శైలిలో స్పందించారు. చల్లా రామకృష్ణారెడ్డి ప్రముఖ కవి కాకపోయినప్పటికీ కూడా, ఎంతో సామాజిక స్పృహతో గాంధీజీ స్వభావాన్ని ప్రతిబింబించేలా జంధ్యాల దర్శకత్వంలో సత్యాగ్రహం అనే చిత్రం రూపొందించారని వెల్లడించారు. అప్పట్లో పాణ్యం ఎమ్మెల్యేగా ఉన్న చల్లా రామకృష్ణారెడ్డి సత్యాగ్రహం చిత్రంలో ప్రధానపాత్రలో నటించారని వివరించారు.

జంధ్యాల సినిమాలను రిలీజ్ రోజునే చూసేవాడ్నని, ఆ విధంగా సత్యాగ్రహం చిత్రాన్ని కూడా చూశానని రఘురామకృష్ణరాజు తెలిపారు. గాంధీ తత్వంపై సినిమా తీసి, ఆ తత్వాన్ని అలవర్చుకున్న రామకృష్ణారెడ్డిగారు నిన్న ఒక చక్కటి వ్యాసం రాశారని అన్నారు.

"ఆ వ్యాసం ఏంటంటే... గాంధీజీ మళ్లీ పుట్టాడు. మంచిదే. రవి కాంచని చోట కవి గాంచున్ అన్నట్టుగా ఆయన గాంధీజీ మళ్లీ పుట్టాడని కనిపెట్టారు. అయితే ఆ మళ్లీ పుట్టిన గాంధీ గారికి రెండు మూడు విషయాలు విన్నపం చేసుకుంటున్నాను. మీరు గతజన్మలో ఉన్నప్పుడు ఏవిధమైన అహింసా సిద్ధాంతం పాటించారో, అదే విధంగా ఎవరికీ ఎటువంటి విఘాతం కలిగించకుండా అమరావతి రైతులు శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్నారు. గతజన్మలో మీరు చూపిన బాటలోనే వారు ఇప్పుడు నడుస్తూ ఉంటే మళ్లీ పుట్టిన గాంధీ గారు ఎందుకు ఇంత తీవ్ర చర్యలు తీసుకుంటున్నారు? ఎందుకు వారితో మాట్లాడేందుకు సంసిద్ధంగా లేరు? అనే అంశాలు తలెత్తుతున్నాయి" అంటూ వ్యాఖ్యానించారు.
Raghu Rama Krishna Raju
Jagan
Gandhi
Challa Ramakrishna Reddy

More Telugu News