Devineni Uma: పెన్షన్ల పంపిణీ తప్ప వాళ్లు చేస్తున్నదేముంది జగన్ గారూ?: దేవినేని

Devineni Uma faults Volunteer system
  • వైసీపీ కార్యకర్తలను వాలంటీర్లుగా నియమించారు
  • వేల కోట్ల రూపాయల జీతాలను ప్రజలపై రుద్దారు
  • వైసీపీ కోసం పని చేయడమే వాళ్ల పని
వైసీపీ ప్రభుత్వం గ్రామ, వాలంటీర్ వ్యవస్థను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చింది. ప్రభుత్వ పథకాలు, లబ్దిదారులకు మధ్య అనుసంధానకర్తలుగా వారు పని చేస్తున్నారు. ఇదే సమయంలో వాలంటీర్ వ్యవస్థపై కూడా అదే స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. తాజాగా టీడీపీ నేత దేవినేని ఉమ ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ... దశాబ్దాలుగా పని చేస్తున్న వ్యవస్థలను వైసీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని ఆయన మండిపడ్డారు.

వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చి వేల కోట్ల రూపాయల జీతాలను ప్రజలపై రుద్దారని విమర్శించారు. వైసీపీ కార్యకర్తలనే ఉద్యోగులుగా నియమించారని చెప్పారు. టీడీపీకి మద్దతుగా ఉండేవారి సంక్షేమాన్ని అడ్డుకోవడం, వైసీపీ కోసం పనిచేయడమే వాలంటీర్ల లక్ష్యమని... పెన్షన్ల పంపిణీ తప్ప ఈ వ్యవస్థ ఏం చేస్తుందో చెప్పండి జగన్ గారూ అని ప్రశ్నించారు.
Devineni Uma
Telugudesam
Jagan
YSRCP

More Telugu News