పోలీసుల తీరు దారుణంగా ఉంది: జడ్జి రామకృష్ణ
- ఛలో మదనపల్లికి పిలుపునిచ్చిన దళిత నేతలు
- ఎక్కడికక్కడ అరెస్ట్ చేస్తున్న పోలీసులు
- టిఫిన్ చేయడానికి కూడా అనుమతించలేదన్న రామకృష్ణ
టిఫిన్ చేయడానికి కూడా తమను పోలీసులు అనుమతించలేదని రామకృష్ణ మండిపడ్డారు. తమలో బీపీ, షుగర్ పేషెంట్లు ఉన్నారని చెప్పినా రూమ్ లో పెట్టి తలుపు వేశారని అన్నారు. అనేక మంది దళిత నేతలను గృహనిర్బంధం చేశారని, కొందరిని అరెస్ట్ చేశారని, అరెస్ట్ చేసిన వారిని ఎక్కడకు తరలిస్తున్నారో కూడా తెలియడం లేదని చెప్పారు. చట్టాన్ని కాపాడాల్సిన పోలీసులే చట్ట వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని... ఇక ఈ సమాజాన్ని కాపాడేది ఎవరని ప్రశ్నించారు. ఇంత దారుణాన్ని ఎప్పుడూ చూడలేదని అన్నారు.