CBI: వివేకా హత్య కేసును విచారిస్తున్న సీబీఐ బృందంలో కరోనా కలకలం

cbi officer tests corona positive
  • మరో అధికారికి కూడా కరోనా పరీక్ష
  • నెగటివ్‌గా నిర్ధారణ
  • కేసు విచారణ వాయిదా పడే అవకాశాలు  
మాజీ మంత్రి, వైసీపీ నేత వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసును సీబీఐ అధికారులు విచారణ జరుపుతోన్న విషయం తెలిసిందే. అయితే, ఈ కేసును విచారిస్తున్న ఓ సీబీఐ అధికారికి కరోనా పాజిటివ్ అని తేలింది. ఆయనతో పాటు విచారణ జరుపుతోన్న మరో అధికారి కూడా పరీక్ష చేయించుకోగా ఆయనకు కరోనా నెగటివ్ అని నిర్ధారణ అయింది.

కరోనా నిర్ధారణ అయిన సీబీఐ అధికారి ప్రస్తుతం క్వారంటైన్‌లో ఉన్నారు. ఆయనతో కలిసి విచారణ జరుపుతోన్న ఇతర అధికారులు కూడా ఈ రోజు కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోనున్నారు. ఈ నేపథ్యంలో వివేకా హత్య కేసు విచారణ వాయిదా పడే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. వివేకా కేసులో సీబీఐ అధికారులు ఇప్పటికే పలువురిని విచారించిన విషయం తెలిసిందే.
CBI
YS Vivekananda Reddy
YSRCP

More Telugu News